Richard Ngarava : జింబాబ్వేకు వన్డేల్లో సారథ్యం వహిస్తున్న రిచర్చ్ ఎంగరవా(Richard Ngarava) టెస్టుల్లోనూ జట్టును నడిపించనున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకోసం స్క్వాడ్‌ను ప్రకటించిన సెలెక్టర్లు ఎంగరవాను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడికిదే తొలి పరీక్ష. స్వదేశంలో జూన్ 28న మొదలయ్యే ఈ మ్యాచ్‌తో జట్టును గెలుపు దిశగా నడిపించేందుకు సిద్ధమవుతున్నాడీ పొడగరి పేసర్.
ఏకైక టెస్టుకోసం ఎంపిక చేసిన 15మంది బృందంలో స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజాకు చోటు దక్కలేదు. ఇంగ్లండ్ వేదికగా జరిగే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు రజా కట్టుబడి ఉండడంతో అతడిని పక్కన పెట్టేశారు. నిరుడు ఏప్రిల్ – మే నెలలో జింబాబ్వే, బంగ్లాదేశ్ రెండు టెస్ట్‌ల్లో తలపడ్డాయి.
Sikandar Raza will not be available for Zimbabwe in their one-off Test against Bangladesh due to his county cricket commitments in England.
Richard Ngarava, who replaced Craig Ervine as Test and ODI captain in December, is set to make his captaincy debut in this fixture
తొలి మ్యాచ్‌లో జింబాబ్వే మూడు వికెట్ల విజయం సాధించింది. కానీ, రెండో మ్యాచ్‌లో గెలుపొందిన బంగ్లా సిరీస్‌ను సమం చేసి పరువు కాపాడుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరుజట్లు ఏకైక టెస్టులో విజయంపై కన్నేశాయి. జూన్ 28న హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో మ్యాచ్ జరుగనుంది.
జింబాబ్వే స్క్వాడ్ : రిచర్డ్ ఎంగరవా(కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, తనకా చివంగా, గ్రేమీ క్రెమర్, క్రేగ్ ఎర్విన్, బ్రాడ్ ఎవాన్స్, ఇన్నోసెంట్ కైయా, రాయ్ కైయా, వెస్లీ మధెవెరె, తడివనషె మరుమని, బ్లెస్లింగ్ ముజరబని, న్యూమాన్ న్యామ్‌హురి, బ్రెండన్ టేలర్, తఫడ్జ్వ త్సిగా.








