అమెరికాలో H-1B వీసా ప్రోగ్రామ్ ప్రధానంగా అమెరికన్ ఉద్యోగులను భర్తీ చేసేందుకు ఉద్దేశించినప్పటికీ, ఇందులో ఎంట్రీ మరియు జూనియర్ స్థాయి ఉద్యోగుల సంఖ్యే ఎక్కువగా ఉంది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో జారీ చేసిన H-1B వీసాలలో 83% ఈ స్థాయి ఉద్యోగులకే దక్కాయి.
ఈ ప్రోగ్రామ్ కింద పనిచేసే వారికి కంపెనీలు చెల్లించే కనీస వేతనం, అమెరికన్ ఉద్యోగుల సగటు వేతనం కంటే $19,000 తక్కువగా ఉంటోంది. దీంతో స్థానిక ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీయులను నియమించుకునే ధోరణి కనిపిస్తోంది.
మరోవైపు అమెరికాలో STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) డిగ్రీలు కలిగిన 11 మిలియన్ల మంది పని చేసే వయస్సు గల వ్యక్తులు, ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేయడం లేదు. అలాగే, విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించే OPT ప్రోగ్రామ్‌లోనూ అక్రమాలు వెలుగుచూశాయి. ఉనికిలో లేని లేదా అనుమానాస్పద కంపెనీల పేరుతో విద్యార్థులు ఉపాధి పొందుతున్నట్లు గుర్తించారు.








