హైదరాబాద్‌లో జరిగిన ఓ సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం అధికారం లేకపోవడంతో ఆ పార్టీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, వారి డ్రామాలను ప్రజలు ఇకపై నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

దోచుకుని దాచుకున్న డబ్బులను ఖర్చు పెట్టి రోజుకో సమావేశం నిర్వహిస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందని, దీనిని దాచుకోవడానికి వారు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హెచ్ సియు (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) భూములపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఎస్ బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అధికారులను ఫోన్ ట్యాపింగ్ ద్వారా లొంగదీసుకున్నారని అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు చేశారు.