రోజూ వాడే పర్సు, కీలు లేదా లగేజీని ఎక్కడో పెట్టి మర్చిపోయే వారికి JioTag 2 ఒక పరిష్కారంగా నిలుస్తుంది. ఈ బ్లూటూత్ ట్రాకర్ ధర రూ. 1,249 మాత్రమే. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు Google Find Hub, ఐఫోన్ యూజర్లకు Apple Find My సర్వీసులతో పనిచేస్తుంది. ఈ డివైస్ వాడకానికి సిమ్ కార్డు, మొబైల్ డేటా లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.

ఈ ట్రాకర్‌ను పర్సు, తాళాలు లేదా బ్యాక్‌ప్యాక్‌కు అమర్చినప్పుడు, అది బ్లూటూత్ ద్వారా ఫోన్‌తో కనెక్ట్ అవుతుంది. వస్తువు దగ్గరలో ఉంటే, యాప్ ద్వారా 120 డెసిబెల్స్ బజర్ మోగించి సులభంగా గుర్తించవచ్చు. ఒకవేళ వస్తువు బ్లూటూత్ రేంజ్ దాటినా, సమీపంలోని ఇతర ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ డివైజ్ల సాయంతో చివరిగా ఉన్న లొకేషన్‌ను యాప్‌లో అప్‌డేట్ చేస్తుంది. లాస్ట్ మోడ్ ఆన్ చేస్తే, ట్రాకర్ గుర్తించినప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తుంది.

JioTag 2 ఐపీ64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఇందులో ఉండే బ్యాటరీ సుమారు ఏడాది పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. బాక్స్‌లోనే అదనపు బ్యాటరీని కూడా అందిస్తున్నారు.

అయితే, ఇది లైవ్ జీపీఎస్ ట్రాకర్ కాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి, దీన్ని వాహనాలు, పెంపుడు జంతువులు, పిల్లలు లేదా వృద్ధులను ట్రాక్ చేయడానికి ఉపయోగించలేము. కేవలం పర్సు, తాళాలు, లగేజీ వంటి వస్తువులను గుర్తించడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.