తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్ ఆనకట్ట సమస్యలపై సమీక్ష నిర్వహించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సమన్వయం లేకపోవడం వల్ల రాష్ట్రంలోకి రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటాలో ఐదారు టీఎంసీలు మాత్రమే అందుతున్నాయిని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్డీఎస్ ఆనకట్టలో పూడిక తొలగింపు పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరమని సీఎం సూచించారు. తుంగభద్ర బోర్డును బలోపేతం చేయడానికి కేంద్ర జలసంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.

2004లో నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పూడిక తొలిగింపు పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సూచించారు.