కృతి సనన్‌ సినిమా సెట్స్‌లో నటీమణులకు వివక్ష ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. హీరోలు ప్రశ్నలు అడిగితే వారి శ్రద్ధను మెచ్చుకుంటారు, కానీ హీరోయిన్లు అదే ప్రశ్నలు అడిగితే 'ఈమె ఏంటి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నది' అని వెనుక మాట్లాడుకుంటారని ఆమె అన్నారు.

ఆమె కెరీర్ ప్రారంభంలో కేవలం గ్లామర్ పాత్రలు మరియు హీరోల పకన రొమాన్స్ సీన్లకే పరిమితం చేయబడినట్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కథల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం వచ్చినా, సెట్స్‌లో వివక్ష రూపం మారింది కానీ పూర్తిగా పోలేదని ఆమె అన్నారు.

సెట్స్‌లో ప్రశ్నలు అడగడం సహజమైన విషయం, కానీ హీరోయిన్లు అడిగితే వారికి 'ఓవర్ ఎనలైజ్' చేయకు అని చెప్పే సంఘటనలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఒకే రకమైన ప్రశ్నకు హీరోలకు మరియు హీరోయిన్లకు ఇచ్చే సమాధానాల్లో ఆకాశం-భూమి తేడా ఉంటుందని ఆమె వివరించారు.

సెట్స్‌లో కార్లు, రూములు, కార్వాన్ల కేటాయింపుల్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. హీరోలకు లగ్జరీ వసతులు కల్పిస్తారు, హీరోయిన్లకు తక్కువగా చూస్తారని ఆమె చెప్పారు. సౌఖ్యాలు ముఖ్యం కాకపోయినా, ఆ వ్యత్యాసం వల్ల కలిగే అవమానం బాధ కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు.