మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ఇద్దరు బస్తాల యూరియా కోసం ఒక రైతు అక్కడున్న నిర్వాహకుల కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. అన్నదాతకు అవసరమైన యూరియాను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచలేకపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
ఈ ఘటనపై హరీష్ రావు ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. 'మార్పు' పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
రైతుల గోసకు ఈ ఘటన ఒక నిదర్శనమని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతు, రెండు బస్తాల యూరియా కోసం వేడుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందని ఆయన విమర్శించారు. రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.








