రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) క్రెడిట్ కార్డు మోసాల బాధితులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. మోసం జరిగిన 5 రోజుల్లోనే బ్యాంకులు వివాదాస్పద మొత్తాన్ని షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో తిరిగి జమ చేయాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమలులోకి వస్తున్నాయి.
బ్యాంక్ లోపాల వల్ల లేదా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల జరిగిన మోసాల్లో ఖాతాదారులపై బాధ్యత పడదు. బ్యాంక్ తప్పు అయితే, మోసపూరిత లావాదేవీని రద్దు చేసి మొత్తం డబ్బును తిరిగి ఇవ్వాలి. థర్డ్ పార్టీ హ్యాకింగ్ సందర్భంలో, 5 రోజుల్లో ఫిర్యాదు చేస్తే మాత్రమే ఖాతాదారుడికి బాధ్యత ఉండదు.
మొదటిసారి మోసం బాధితుడిగా రూ.50,000 లోపు నష్టపోతే, 85% లేదా గరిష్ఠంగా రూ.25,000 పరిహారం పొందవచ్చు. ఇది జీవితంలో ఒక్కసారే వర్తిస్తుంది. రూ.500 కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ లావాదేవీలకు బ్యాంకులు తప్పనిసరిగా ఎస్‌ఎంఎస్ అలర్ట్లు పంపాలి.








