బీబీ కా అలం ఊరేగింపు హైదరాబాద్‌లో 1594 నుంచి ఏటా ఆగకుండా నడుస్తున్న సంప్రదాయం. ఈ సారి మొహర్రం సందర్భంగా కేరళ నుండి ప్రత్యేకంగా ఏనుగును తీసుకురావడం జరగనుంది.
ఈ ఊరేగింపులో బీబీ ఫాతిమా ఉపయోగించిన బల్లతో తయారు చేసిన అలం, నిజాం పాలకులు ఇచ్చిన వజ్రాలు, వైఢూర్యాలు ఉన్నాయి. దీన్ని దబీర్‌పురాలోని బీబీ కా అలావాలో పోలీసుల కఠిన భద్రతలో ఉంచుతారు.
పోలీసు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో 2వేల మంది పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంప్రదాయం హైదరాబాద్ మత సామరస్యానికి నిదర్శనం.








