నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు 110 సినిమాలు చేశారు, కానీ విలన్‌గా నటించిన ఏకైక సినిమా సుల్తాన్. 1999లో శరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆయన ఉగ్రవాది పాత్రలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల ఆసక్తిని పొందలేకపోయినా, బాలకృష్ణ గెటప్పులు అభిమానులను మెప్పించాయి. కోటి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. అయితే, ఆడియెన్స్ ఆయనను విలన్‌గా చూడలేకపోయారు.
సుల్తాన్ ఓరిజినల్ తెలుగు వెర్షన్ ఇప్పటివరకు యూట్యూబ్‌లో లేదు. కానీ హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది. కానీ ఈ సినిమాలోని కొన్ని హైలైట్ సీన్స్ మరియు పాటలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఇంకా విలన్‌గా నటించలేదు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 111 సినిమా షూటింగ్‌లో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.