మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద 200K డాలర్ల మార్కును అధిగమించింది. పాజిటివ్ టాక్‌తో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా అక్కడ భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది.
గాంధీ మేర్లపాక దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ థ్రిల్లర్‌లో రితిక నాయక్ కథానాయికగా నటించారు. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్‌లో విడుదల చేసింది.
ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా అన్ని థియేటర్లలో పాస్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ సినిమా అక్కడ సాలిడ్ రన్‌ను కొనసాగిస్తుండటంతో, రానున్న రోజుల్లో మరిన్ని భారీ వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.







