రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో మిస్ యూనివర్స్ 2026 అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. చివరకు ఎంతో మంది అందగత్తెలను వెనక్క నెట్టి కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె ఇప్పుడు 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. కాగా ఈ అందాల పోటీల న్యాయనిర్ణేతల బృందంలో మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్, ఊర్వశి రౌతేలా, సెలీనా జైట్లీ ఉన్నారు. ఈ పోటీల సందర్భంగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె త్రివర్ణ పతాక రంగుల స్ఫూర్తితో రూపొందించిన ఆఫ్-షోల్డర్ గౌనును ధరించింది. నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగులలో ఉన్న ఈ గౌను మధ్యలో అశోక చక్రం ప్రతిరూపం ఉంది. అయితే, ఆమె వేసుకున్న ఈ దుస్తులు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగాఊర్వశి ధరించిన దుస్తులు జాతీయ జెండా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని కొందరు యూజర్లు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. త్రివర్ణ పతాకాన్ని దుస్తులుగా ఉపయోగించడంపై చట్టపరంగా ఆంక్షలు ఉన్నాయని కూడా కొందరు కామెంట్స్ పెట్టారు. మరికొందరు ఇది త్రివర్ణ పతాకాన్ని అవమానించడమేనని అంటున్నాను.

మొత్తానికి ఊర్వశి సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంటోంది ఊర్వశి రౌతెలా. 1971 నాటి జాతీయ జెండా గౌరవానికి అవమానాల నివారణ చట్టం’ ప్రకారం జాతీయ పతాకాన్ని అగౌరవపరచడం శిక్షార్హం. ఈ చట్టం ప్రకారం త్రివర్ణ పతాకాన్ని వస్త్రంగా, దుస్తులుగా లేదా యూనిఫాంగా ఉపయోగించడాన్ని, అలాగే కొన్ని వస్తువులపై దాని ప్రతిరూపాన్ని ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. ఉద్దేశపూర్వకంగా జాతీయ పతాకాన్ని అగౌరవపరిస్తే, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు. మరి ఇప్పుడుఊర్వశి రౌతేలా కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించిందా? జాతీయ జెండాను అగౌరవపరిచిందా?అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

“One should never consider failure as a failure. There is always scope to learn and to move further. ”

– Urvashi Rautela during Grand Finale of Miss Universe India 2026

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.