ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఏటా జరిగే 'ఫేట్ డి లా ముసిక్' సంగీతోత్సవం ఈసారి భయాందోళనకరంగా మారింది. పారిస్ నగర వీధుల్లో మహిళలపై సిరంజీలతో సూదులు గుచ్చడం, లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలు విస్తృతంగా జరిగాయి. బౌలేవార్డ్ డి లా మాడలీన్ ప్రాంతంలో ఒక మహిళ స్పృహ తప్పి ఆసుపత్రికి తరలించబడింది.
ఈ సంఘటనల్లో కొందరు మైనర్లూ బాధితులని అనుమానిస్తున్నారు. ఛాటెలెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో గ్యాంగ్ వార్స్, తొక్కిసలాటలు కూడా నమోదయ్యాయి. బ్రిటన్ పర్యాటకుడు స్టీవ్ 'ప్రమాదకర పరిస్థితులు, అన్ని చోట్ల గొడవలు' అని వివరించాడు.
వేలాది పోలీసులను మోహరించి దర్యాప్తు జరుపుతున్నారు. పారిస్‌లోనే ఎక్కువ మందిని అరెస్టు చేశారు. భద్రతా ఏర్పాట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ దాడులపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.






