మంగళవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే సాధించగలిగింది. కెప్టెన్ అమెలియా కెర్, సోఫి డివైన్ చెరో 45 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 19.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. నీలాక్షిక సిల్వా (54 నాటౌట్), కౌశాని (24 నాటౌట్) రాణించడంతో లంక జట్టు గెలుపు సాధించగలిగింది.







