హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ అట్టహాసంగా మొదలైంది. ఈ టోర్నమెంట్ జూన్ 28 వరకు కొనసాగనుంది. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
సినీ నటి శ్రుతి హాసన్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె ఈ కార్యక్రమంలో పాటలు పాడటంతో పాటు ఆటతో కూడా అలరించింది. దీంతో స్టేడియం మొత్తం రగ్బీ సందడితో మారిపోయింది.
ప్రారంభ రోజున జరిగిన తొలి పోటీలో హైదరాబాద్ హీరోస్ జట్టు 21–28 స్కోరుతో బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ రెడ్స్ జట్టు 31–21తో చెన్నై బుల్స్‌పై విజయం సాధించింది.
రగ్బీ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలోని ప్రముఖ రగ్బీ టోర్నమెంట్. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నగరాల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.






