మిడ్ రేంజ్ హీరోస్‌కి ఈ ఇయర్ బాగా కలిసివచ్చింది. కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న హీరోస్ అంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. సరైన కాంటెంట్‌తో వస్తే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారన్న విషయం బోధపడింది హీరోస్‌కి. భారీ ఓపెనింగ్స్, మంచి వసూళ్లను చూశారు. 2026లో ఇప్పటివరకు స్ట్రాంగ్ కం బ్యాక్ తీసుకున్న హీరోస్ ఎవరో ఓ లుక్ వేద్దామా? ఫెయిల్యూర్స్‌లో ఉన్న హీరోలంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. నాగచైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆది సాయికుమార్ వరకు గత ఏడాది గట్టెక్కితే.. ఈ ఏడాది శుభారంభం చేశారు శర్వానంద్ అండ్ సంతోష్ శోభన్. ‘నారీ నారి నడుమ మురారి’తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు శర్వా, ‘కపుల్ ఫ్రెండ్లీ’తో సక్సెస్ టేస్ట్ చేశాడు సంతోష్ శోభన్.

‘ఏజెంట్’ దెబ్బకు అఖిల్ అడ్రెస్ గల్లంతయింది. మూడేళ్ల పాటు సిల్వర్ స్క్రీన్‌కు గ్యాప్ ఇచ్చిన అక్కినేని హీరో, విలేజ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘లేనం’తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, సినిమాలోని ట్విస్ట్ అండ్ టర్నింగ్స్‌కు ఫిదా అయిన మూవీ లవర్స్ అఖిల్‌కు 100 కోట్లు కట్టబెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. వరుణ్ తేజ్ సోలో హీరోగా సక్సెస్ చూసి చానాళ్లే అవుతుంది. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత ‘ఎఫ్ 3’తో హిట్ అందుకున్నా, అది వెంకీ, అనిల్ రావిపూడి ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ బాంబ్సే. అందుకే ఈసారి హార్రర్ కామెడీని నమ్ముకొని ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డివైడ్ టాక్‌తో 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుంది ఆ ఫిలిం. రవితేజ ఓ హిట్ కొడితే, నాలుగైదు ఫ్లాప్స్ పలకరించడం అలవాటు చేసుకున్నాడు. ‘ధమాకా’ తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్స్. మధ్యలో ‘వాల్తేరు వీరయ్య’లో స్మాల్ రోల్ చేసినప్పటికీ సోలో హిట్ కాదు. వరుస ఫ్లాప్స్‌లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ కిక్ ఇచ్చి హిట్‌ని ఇచ్చింది. వీకెండ్‌లో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది ఈ డివోషనల్ ఫ్యామిలీ డ్రామా. శర్వానంద్ నుండి రవితేజ వరకు బౌన్స్ బ్యాక్ అయ్యారు. అయితే, ఇంకొంతమంది మిడ్ రేంజ్ హీరోస్ కొన్నేళ్లుగా ఫ్లాప్స్‌లో కొట్టుమిట్టాడుతున్నారు. గోపీచంద్, విజయ్ దేవరకొండ, నితిన్‌తో పాటు స్టిల్ బ్యాచిలర్ బాయ్స్ కూడా సాలిడ్ కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లెవరో చూద్దామా!

గోపీచంద్‌కు విజయం ఆమడ దూరంలో ఆగిపోతుంది. 2021లో వచ్చిన ‘సీటీమార్’ తర్వాత సాలిడ్ హిట్ చూడలేదు మ్యాచో స్టార్. నెక్స్ట్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చారిత్రాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ ‘భరత్ వర్ష’ చేస్తున్నాడు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్. దీంతో పాటు ‘సింగా’ కూడా లైన్‌లో ఉంది. మరి ఏ సినిమాతో గోపీచంద్ బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి. 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’తో హిట్ చూసిన ఈ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో వస్తున్నా, యాక్షన్ మూవీతో ఎంట్రీ తీసుకున్నా నో సక్సెస్. ఈ ఏడాదే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బాయ్ చెప్పిన విజయ్ దేవరకొండ టూ ఫిలిమ్స్ లోడ్ చేస్తున్నాడు. భార్య రష్మికతో కలిసి ‘రణబాలి’, కీర్తి సురేష్ హీరోయిన్‌గా ‘రౌడీ జనార్ధన’ చేస్తున్నాడు. సెప్టెంబర్ 11న ‘రణబాలి’ రిలీజ్ కావాల్సి ఉండగా, షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో పోస్ట్ పోన్ కానుంది. డిసెంబర్ బరిలో దిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

నితిన్ కొన్నాళ్ల నుంచి డిజాస్టర్స్ చవి చూస్తూనే ఉన్నాడు. ‘భీష్మ’ తర్వాత వరుస పరాజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఏడాది వచ్చిన ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ రెండు భారీ డిజాస్టర్లుగా మారాయి. ఈ ఏడాది కూడా టూ త్రీ ఫిలిమ్స్ కమిట్ అయ్యాడు నితిన్. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ కమిట్ అవ్వగా ఆగిపోయిందని టాక్. ‘ఆయ్’ దర్శకుడు అంజీతో మరో మూవీ, కొత్త దర్శకుడితో మరో మూవీ చేస్తున్నాడట. మరి ఈ ఏడాది వీటిల్లో ఒక్క సినిమాతోనైనా ముందుకు వస్తాడో రాడో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ‘రెడ్’ తర్వాత స్ట్రాంగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్ పోతినేని. గత ఏడాది రిలీజ్ అయిన ‘ఆంధ్ర కింగ్’ పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఈసారి దర్శకుడిగా మారి ‘రాపో 23’ని మేకింగ్ చేస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డది ఇదే ఫేజ్. ‘తెలుసు కదా’ ఓ వర్గానికి నచ్చింది కానీ, మిగిలిన వాళ్లకు ఈ కాన్సెప్ట్ అర్థం కాక పక్కన పెట్టేశారు. నెక్స్ట్ టూ త్రీ ఫిలిమ్స్ చేస్తున్నాడు టిల్లు. ‘లైలా’తో మొదలైన ఫ్లాప్ పరంపరను ‘ఫంకీ’ వరకు కంటిన్యూ చేశాడు విశ్వక్ సేన్. తన దర్శకత్వంలో ‘కల్ట్’, ‘ఈ నగరానికి ఏమైంది’ రిపీట్, ‘లెగసీ’ చేస్తున్నాడు. వీటిల్లో ఏది ముందు తెస్తాడో, ఏ మూవీతో హిట్ కొడతాడో చూడాలి. 2026 చాలా మంది ఫ్లాప్ హీరోలకు సక్సెస్ ఇచ్చింది. మరి వీళ్లకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో లెట్స్ వెయిట్.