కయాదు లోహర్ పదో తరగతిలో ఉన్నప్పుడు, ఇంటికి సమీపంలోని ట్యూషన్ కు వెళ్లే మార్గంలో ప్రతిరోజూ కొందరు అబ్బాయిలు ఆమెను వేధించేవారని తెలిపారు. మొదటి రెండు రోజులు మౌనంగా తట్టుకున్నారు, కానీ మూడో రోజు కోపంతో రోడ్డుపై ఉన్న రాయిని తీసుకుని వారివైపు విసిరినట్లు గుర్తు చేసుకున్నారు.

ఆ రాయి ఒక యువకుడి తలకు తగిలి రక్తస్రావం కలిగిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోయారు, ఏమైందో తెలియదని అన్నారు. ఆ సమయంలో కోపం, భయం, నిస్సహాయత కలిసి ఆమెను అలా ప్రవర్తించేలా చేశాయని వివరించారు.

ఇప్పుడు ఆ ఘటనను తిరిగి గుర్తు చేసుకుంటే, హింస ఎప్పుడూ పరిష్కారం కాదని ఆమె అంగీకరించారు. కానీ ఆ పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి కారణంగానే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని కూడా చెప్పారు. సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తి కానీ, తప్పు చేస్తే మౌనంగా భరించడం కూడా సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించి, విద్యార్థినులు ఎదుర్కొంటున్న వేధింపుల సమస్యపై మరోసారి చర్చ మొదలైంది. పలువురు నెటిజన్లు విద్యాసంస్థల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం కయాదు లోహర్ నటిస్తున్న చిత్రాలు 'ఇధయమ్ మురళి' (జూలై 10), 'ఇమ్మోర్టల్' (జూలై 23), 'ఐ యామ్ గేమ్', 'ఖలీఫా', 'ది ప్యారడైజ్' మరియు సూర్య నటించే ఒక చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.