మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో, ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తన తండ్రిని ఉద్దేశించి 'పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న' అంటూ రామ్ చరణ్ తన ప్రేమను చాటుకున్నారు.
రామ్ చరణ్ తన తండ్రిని 'నా మొదటి హీరో' అని, 'నా గొప్ప స్ఫూర్తి' అని అభివర్ణించారు. తాను ఎల్లప్పుడూ ఆశ్రయించగలిగే వ్యక్తి చిరంజీవి అని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలోని ప్రతి సుఖదుఃఖంలో తండ్రి ప్రేమ, మార్గదర్శనం, తనపై ఆయనకున్న నమ్మకమే అతిపెద్ద బలమని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
తన జీవితంలో చిరంజీవి ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. తండ్రికి మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని, రాబోయే కాలంలో ఆయన మరింత అద్భుతంగా ఉండాలని రామ్ చరణ్ కోరుకున్నారు. నిన్ను మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నానని తండ్రిపై తన అప్యాయతను పంచుకున్నారు.
రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. ఈ పోస్ట్‌ను చూసిన అభిమానులు సైతం మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.








