తమిళ నటుడు ధనుష్ తాను చదువుకున్న పాఠశాల కోసం కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి అవసరమైన పూర్తి ఖర్చును ధనుష్ స్వయంగా భరించడం విశేషం.

ఈ కొత్త భవన ప్రారంభోత్సవ వేడుకను పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధనుష్‌తో పాటు ఆయనతో కలిసి చదువుకున్న సహపాఠికులు హాజరయ్యారు. తమ మిత్రుడి చొరవను పాఠశాల యాజమాన్యం మరియు సహపాఠికులు అభినందించారు.

ఈ భవన నిర్మాణం తన పాఠశాల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టమని ధనుష్ పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధిలో తాను భాగస్వామిని కావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.