రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న అత్యంత ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్ర కథ ప్రధానంగా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగుతుందని ఆయన తెలిపారు.

దీంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. పాన్ ఇండియా స్థాయి హీరోను హైదరాబాద్ వ్యక్తిగా చూపిస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారన్న అనుమానం వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే కథ పరిధి కంటే సందీప్ వంగా మార్క్ డ్రామా, క్యారెక్టరైజేషన్‌నే సినిమాకు ప్రధాన బలంగా మారనున్నాయి.

‘యానిమల్’ చిత్రాన్ని కూడా ప్రాంతం మార్చకుండా ఒకే నగర నేపథ్యంలో తీసి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపించాడో అందరికీ తెలుసు. త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.