మాజీ ముఖ్యమంత్రి YS Jagan మూడు రోజుల పర్యటనలో రెండో రోజు (24 జూన్, బుధవారం) పులివెందులలో కొనసాగించారు. భూమయ్యగారిపల్లెలోని గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఇటీవల మరణించిన మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను భూమయ్యగారిపల్లెలో సందర్శించి, బాకరాపేటలో ఒక చిన్నారికి ఓనమాలు దిద్ది అక్షరాభ్యాసం చేయించారు. పులివెందుల మున్సిపాలిటీలోని ఎర్రగుడిపల్లిలో సీసీ రోడ్లు ప్రారంభించారు.
చివరిగా పులివెందులలోని ఒక నివాసంలో చిన్నారికి 'దైవిక' అనే పేరు పెట్టి నామకరణం చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా స్థానికులతో ప్రత్యక్ష సంభాషణను కొనసాగిస్తున్నారు YS Jagan.








