పవన్ కల్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో రాబోయే OG-2 సినిమా షూటింగ్ ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. పవన్ కల్యాణ్ భుజానికి సర్జరీ అవసరమవ్వడంతో ఆయన ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనివల్ల ఆయన వెంటనే షూటింగ్ సెట్స్‌లోకి వచ్చే అవకాశం లేదని సమాచారం.
సర్జరీ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కానున్నారు. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆయనకు సుమారు ఆరు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఈ కాలంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు కూడా మారే అవకాశం ఉండటంతో, వచ్చే ఏడాదిలో కూడా OG-2 షూటింగ్ మొదలవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితుల దృష్ట్యా డైరెక్టర్ సుజీత్ తన ప్లాన్ మారుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్‌లో OG-2 షూటింగ్ ప్రారంభించాలని మొదట అనుకున్నప్పటికీ, అది వాయిదా పడే అవకాశం ఉండటంతో సుజీత్ ఇప్పుడు హీరో నానితో చేయాల్సిన 'బ్లడీ రోమియో' సినిమాపై దృష్టి పెట్టారు.
ప్రస్తుతానికి OG-2 ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఉంది, ఇంకా కాస్టింగ్ కూడా ఖరారు కాలేదు. పవన్ కల్యాణ్ భుజానికి ఆపరేషన్ జరగడంతో ఫైట్ సీక్వెన్స్‌లు చేయడానికి సమయం పడుతుంది. అయితే, ఈ విషయాలపై అధికారిక ప్రకటన వస్తేనే OG-2 మరియు 'బ్లడీ రోమియో' సినిమాలపై స్పష్టత రానుంది.







