జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : వన మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ప్రతి విద్యార్థినికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎంపీడీవో బి.శ్రీనివాస్, ఎంపీఓ రాము మాట్లాడుతూ… పచ్చనిచెట్లు మానవుని మనుగడకు ఎంతో దోహదపడతాయని, చెడు వాయువును పిలుచుకొని మంచి ఆక్సిజన్ ను అందించడం జరుగుతుందన్నారు. చెట్లు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా వర్షాలు పుష్కలంగా పడేందుకు దోహదపడతాయని, దీంతో పంటలు కూడా బాగా పండుతాయన్నారు.
చెట్లు పశుపక్షులకు ఆశ్రయాన్నిస్తూ,ప్రకృతి సమతుల్యాన్ని కాపాడడంలో కీలకపా కీలకపాత్ర వహిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా చెట్లు నాటడం కాకుండా,వాటిని సంరక్షించాలన్నారు. కేజీబీవీ కి చెందిన విద్యార్థినులందరూ ఒక్కొక్క మొక్క నాటి దాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ సర్పంచ్ భర్త కె.సాయగౌడ్, బస్వపూర్ సర్పంచ్ భర్త సురేష్ గొండ, కేజీబీవీ నిర్వాహకురాలు హేమలత, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాములు, ప్రభుత్వ వైద్యశాఖ ఉద్యోగులు, ఉపాధిహామీ ఈసీ స్వామిదాస్ ఎఫ్ఓలు తదితరులు పాల్గొన్నారు.








