చివరిసారిగా 2015లో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన 'కట్టి బట్టి' చిత్రంలో కనిపించిన ఇమ్రాన్ ఖాన్, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నటనను ప్రారంభించారు. తన తాజా చిత్రం షూటింగ్‌ను ఆయన ఇప్పటికే పూర్తి చేశారు.
'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'తో జరిగిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రానికి 'అధూరే హమ్ అధూరే తుమ్' అని పేరు పెట్టారు. ఇది నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఒరిజినల్ చిత్రం.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉందని ఆయన తెలిపారు. ఇది తన ప్రస్తుత వయసుకు తగిన మెచ్యూర్డ్ రొమాంటిక్ కామెడీ కథాంశంతో సాగుతుందని ఇమ్రాన్ ఖాన్ వివరించారు.
ఈ ఏడాది చివరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.








