కర్నూలు జిల్లాలో గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. ఈ కేసు సంబంధించి హైకోర్టు తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం, పూర్తి దర్యాప్తు నివేదికను తమకు సమర్పించాలని సిబిఐకి ఆదేశించింది.

ఈ కేసుపై వైసీపీ నేతలు మేరుగ నాగార్జున, సుధాకర్ బాబు బుధవారం కౌతాళం మండలం బదినేహళ్ గ్రామంలో గంగమ్మ కుటుంబాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు పోలీస్ స్టేషన్లను 'మరణ శాసనాలు' అని, పోలీసులను 'నరరూప రాక్షసులు'గా అభివర్ణించారు.

గంగమ్మ, ఆమె కుమార్తె దర్గప్పను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపారని, మరణం తర్వాత 200 మంది పోలీసులతో రహస్యంగా శవాన్ని తరలించారని ఆరోపించారు. కుమారుడు వీరేంద్రను చంపింది తామే అని ఒప్పుకోవాలని తల్లిని బలవంతం చేసారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు న్యాయపరమైన పరిష్కారం ఎందుకు లేదని నాగార్జున ప్రశ్నించారు.