ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్న తాజా చిత్రాలలో మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా, దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన “ఇరుముడి” కూడా ఒకటి. మంచి బజ్‌తో విడుదలైన ఈ సినిమాకు సాలిడ్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. థియేటర్లలో రాణిస్తున్న ఈ సినిమా బిగ్ స్క్రీన్ల తర్వాత ఓటీటీలోకి రానుంది.

థియేటర్ విడుదలకు ముందే సినిమా ఓటీటీ భాగస్వామిపై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాబట్టి బిగ్ స్క్రీన్లపై ఎంటర్‌టైన్‌మెంట్ తర్వాత ఈ ఓటీటీలో సినిమా సందడి చేయనుంది.

ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.