హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాక్‌టెయిల్ 2'. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక, కృతి సనన్ కథానాయికలుగా కనిపించారు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. 2026లో విడుదలైన హిందీ సినిమాల్లో, మొదటి వీకెండ్‌లోనే రూ. 50 కోట్ల వసూళ్లను దాటిన చిత్రాల్లో 'కాక్‌టెయిల్ 2' ఒకటిగా నిలిచింది.
థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 14 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.








