అల్లు అర్జున్, కోలీవుడ్ దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో కొనసాగుతోంది. కుటుంబంతో వెకేషన్ ముగించుకుని, హైదరాబాద్‌లో అభిమానులను కలిసిన తర్వాత అల్లు అర్జున్ నేరుగా ముంబై సెట్స్‌లో అడుగుపెట్టారు. హాలీవుడ్ స్థాయి సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
నిజానికి ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన షెడ్యూల్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేశారు. అయితే, ఇరాన్-యుద్ధం కారణంగా తలెత్తిన భద్రతా సమస్యల వల్ల ఆ ప్రణాళికను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో దర్శకుడు అట్లీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ముంబైలోనే భారీ సెట్లు నిర్మించి షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో, ఆమెకు సంబంధించిన సన్నివేశాలను అట్లీ ముందుగానే ప్లాన్ చేసి పూర్తి చేశారు. మరోవైపు, ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) బాధ్యతలను ఒక ప్రముఖ హాలీవుడ్ స్టూడియో చూస్తోంది. వారి సాంకేతిక అవసరాల కోసం ముంబైలో ప్రత్యేకంగా ఒక భారీ సౌండ్ స్టేజ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
హాలీవుడ్ టెక్నీషియన్ల భాగస్వామ్యం, భారీ సెట్లు మరియు నటుల రెమ్యునరేషన్ల కారణంగా ‘రాకా’ బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉంటోందని బాలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లకుండా, ముంబైలోనే అన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసేలా మేకర్స్ ఏర్పాట్లు చేశారు.








