నటి మృణాళిని రవి తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మలేసియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు మహావిష్ణుతో ఆమె నిశ్చితార్థం రహస్యంగా జరిగింది. గత ఏడేళ్లుగా వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటున్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన మృణాళిని, డబ్‌స్మాష్ మరియు టిక్‌టాక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. ఆ క్రమంలోనే ఆమెకు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. 2019లో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘బుజ్జమ్మ’ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

తమిళంలో త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్ డీలక్స్’ చిత్రంతో ఆమె నటిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘ఛాంపియన్’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’ వంటి చిత్రాల్లో నటించారు. విక్రమ్ నటించిన ‘కోబ్రా’ చిత్రంలోని పాత్రతో ఆమె మంచి గుర్తింపు పొందారు. తెలుగులో ‘మాయ మశ్చింద్రా’ చిత్రంలో కనిపించిన ఆమె, చివరగా 2024లో విడుదలైన విజయ్ ఆంటోని ‘రోమియో’లో నటించారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలకు దూరంగా ఉంటున్న మృణాళిని, ఈ నిశ్చితార్థం తర్వాత నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఆమె నిశ్చితార్థంపై అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.