Kaaka | టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవికి బర్త్‌డే ట్రీట్ ఇస్తూ మెగా 158 టైటిల్‌ గ్లింప్స్ విడుదల చేశారని తెలిసిందే. ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌తోపాటు విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. కాగా క్లాస్‌, మాస్ టచ్‌ ఇస్తూ చిరంజీవి ఇచ్చిన స్టైలిష్ ఎంట్రీ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రానికి కేవీఎన్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కే నారాయణ నిర్మిస్తున్నారని తెలిసిందే. ఇవాళ నిర్మాత వెంకట్ కే నారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు.

వెంకట్ కే నారాయణ సెట్స్‌లో చిరంజీవి, బాబీతో కలిసి సంభాషిస్తున్న విజువల్స్‌తోపాటు గ్లింప్స్ ను చూసి ఎంజాయ్ చేస్తుండటం చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టైటిల్‌ను ప్రకటించడంతోపాటు సుమారు 3 నిమిషాలకు పైగా ఉన్న పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో చిరంజీవి ఎంతో స్టైలిష్‌గా, మాస్ లుక్‌లో కనిపించారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథగా ఈ సినిమా ఉండబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. స్టైలిష్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో రూపొందిన గ్లింప్స్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ కథాంశానికి తగ్గట్టుగా మాస్ బీజీఎం, పవర్‌ఫుల్ సాంగ్స్‌తో థమన్ మరోసారి తన మార్క్ చూపించనున్నారని గ్లింప్స్ హింట్‌ ఇచ్చేస్తుంది. ఈ చిత్రంలో చిరు రెండు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు గ్లింప్స్‌ చెబుతోంది. మ‌ధ్య వ‌య‌స్కుడైన స‌త్యం రూపంలో హుందాగా క‌నిపించిన చిరు చివ‌రలో యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.