మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తన 17వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. 'గేమ్ ఛేంజర్' సినిమా తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ రామ్ చరణ్ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్స్ మల్టీప్లెక్స్ వ్యాపారంలో రాణిస్తున్నారు. వీరి బాటలోనే రామ్ చరణ్ కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ మరియు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టిన చరణ్, ఇప్పుడు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారు.
ఈ మల్టీప్లెక్స్‌ను 2027లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.








