Konda Surekha | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్‌లో ‘సురేఖ వర్సెస్ రేవంత్’ వార్ పీక్స్‌కు చేరింది. సినిమా ప్రముఖులపై వ్యాఖ్యలు, సొంత పార్టీ నేతలతో విభేదాల నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి వర్గం పట్టుబడుతున్నది. 17మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సురేఖపై చర్యలు కోరుతున్నా కాంగ్రెస్‌లోని మెజారిటీ సీనియర్లు మాత్రం మౌనం వహిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో ఇది కేవలం ఓ మంత్రి వ్యవహారంగా కాకుండా పార్టీలోని అంతర్గత ఆధిపత్య పోరుకు, ‘ఒరిజినల్ కాంగ్రెస్ -వలస నేతల’ మధ్య నెలకొన్న విభేదాలకు ప్రతిబింబంగా మారింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కాంగ్రెస్ సీనియర్ నేతగా, బీసీ కార్డు, వరంగల్ క్యాడర్ సమీకరణాలు, సొంత పార్టీలోని ‘ఒరిజినల్ వర్సెస్ వలస’ నేతల అంతర్గత పోరు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని తొందరపాటు చర్యలు అవసరం లేదని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో ఏం జరుగుతున్నదో పూర్తిగా తెలుసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని ఢిల్లీ సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి చెప్పారు. ముందుగా ఏఐసీసీ దూత మీనాక్షీ నటరాజన్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నదని, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించి ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకుంటుందని, చివరగా టీపీసీసీ అధ్యక్షుడి వివరణ కోరిన తర్వాతే కొండా సురేఖపై తుదినిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. ఒక వేళ ఆమెపై చర్యలకు ఉపక్రమించినా బర్తరఫ్ మాత్రం ఉండదని, గౌరవ ప్రదమైన చర్యలే ఉంటాయని ఆయన స్పష్టంచేశారు.
సురేఖను హఠాత్తుగా బర్తరఫ్ చేస్తే తలెత్తే రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ మహిళా నేతగా ఉన్న సురేఖపై వేటు వేస్తే ‘కాంగ్రెస్ బీసీ నాయకత్వాన్ని అణచివేస్తున్నది’ అనే రాజకీయ ప్రచారాన్ని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉన్నదని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలిసింది. బీసీ మహిళా నేత బర్తరఫ్ అంటే దేశ వ్యాప్తంగా పార్టీలపై ప్రభావం చూపుతుందని ఏఐసీసీ ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. మరోవైపు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి ఉన్న గట్టి కేడర్ బహిరంగ తిరుగుబాటు చేస్తే భవిష్యత్తు ఎన్నికల్లో, రాబోయే స్థానిక సంస్థల సమరంలో పార్టీ ఓటు బ్యాంకు గల్లంతవుతుందనే భయం హైకమాండ్‌ను వెంటాడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీలో ‘వలస నేతలు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్’ పోరు నడుస్తున్న వేళ, సురేఖపై చర్యలు పాత కాంగ్రెస్ నేతల్లో తిరుగుబాటు గళాన్ని మరింత పెంచేలా ఉన్నాయని, ఇప్పటికే పార్టీలో అంతర్గత అసంతృప్తి, ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో తొందరపాటు చర్య మరింత చిచ్చు రేపే ప్రమాదం ఉన్నదని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వేదికగా గట్టిగా పట్టుబడితే తప
మన తెలంగాణ/హైదారాబాద్: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి విశ్వసనీయ వర్గాల సమాచారం. విదేశీ పర్యటన ముగించుకొని ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రాగానే పార్టీ ముఖ్యనేతలతో చర్చించి ఆ మరుసటి రోజు 24న కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాయనున్నారని ఈ వర్గాల సమాచారం. ఈ మేరకు రంగం సిద్ధమైందని కూడా చెబుతున్నారు. సిడబ్లూసి సమావేశం జరిగిన రోజునే మంత్రి కొండా సురే ఖ కూతురు సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలను ము ఖ్యమంత్రి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గతంలో కూడా ఇదేమాదిరిగా కొండా సురేఖ కూతురు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ సహచర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకొని ఆమెపై చర్య తీసుకోకుండా వారు నిలువరించిన విషయాన్ని కూడా పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిసింది. ఒకవైపు సర్‌లో భారీ గా ఓట్లు తొలగింపు, మరోవైపు మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను, ప్రజలను సమాయత్తం చేస్తోన్న తరుణంలో ప్రభుత్వంలో కీలకమైన పదవులలో
ఉన్నవారే ఒకరి తర్వాత ఒకరు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించ డం వల్ల ప్రజలలో చులకన అవుతామని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసిం ది. పార్టీ పెద్దలు కూడా సీఎం వాదనతో ఏకీభవిస్తూ పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించడానికి గ్రీన్ సి గ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అధిష్ఠానం మనోగ తం వెల్లడి అయిన తర్వాతనే మంత్రి కొండా సు రేఖకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇవ్వడం, ఎమ్మెల్యేలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చర్యకు డిమాండ్ చేయడం చకచకా జరిగిపోయినట్టు ఈ వర్గాల సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి పై మంత్రి కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలు చేసిన రోజు స్పందించని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఆ మరోసటి రోజు అధిష్టాన పెద్దల మనోగతం బహిర్గతం అయిన తర్వాతనే స్పందించడానికి కారణమని ఈ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పార్టీ సీనియర్ నాయకుడు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డిపై చర్యకు కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఈ వర్గాల సమాచారం. శాసనసభ ఎన్నికలలో తనకు మొదట టికెట్ ఖరారు చేసి, ఆ తర్వాత డబ్బులు తీసుకొని మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపించిన విషయాన్ని కూడా అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం కావడం వల్లనే చర్య తీసుకున్నారన్న తప్పుడు సంకేతాలు ప్రజలలో వెళ్లకుండా చిన్నారెడ్డిపై కూడా చర్యకు అధిష్ఠానం ఆదేశించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించనున్నారని ఈ వర్గాల సమాచారం. ఇలా ఉండగా ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ పార్టీలోకి రావాల్సిందిగా కొండా సురేఖను జనసేన పార్టీ నాయకులు సంప్రందించినట్టు వరంగల్ ఆ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.








