Telugu » Sports » Ind Vs Sl 2nd Test Day 2 Stumps Sri Lanka Trail By 495 Runs

IND vs SL 2nd Test Day 2 Stumps Sri Lanka trail by 495 runs

IND vs SL : కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 8 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. కామిల్ మిషారా (5) క్రీజులో ఉన్నాడు. భార‌త తొలి ఇన్నింగ్స్ స్కోరుకు లంక ఇంకా 495 ప‌రుగుల దూరంలో ఉంది.

Stumps, Day 2: A thoroughly dominant day comes to an end as #TeamIndia take two quick wickets to reduce Sri Lanka to 8-2 after declaring at 503-9. Earlier, Dhruv Jurel registered his 2nd Test ton.

అంత‌కముందు టీమ్ ఇండియా త‌మ తొలి ఇన్నింగ్స్ ను 503/9 స్కోరు వ‌ద్ద డిక్లేర్ చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (117; 193 బంతుల్లో 12 ఫోర్లు) ధ్రువ్ జురెల్ (115 నాటౌట్; 177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు సెంచరీలు చేశారు.

రిష‌బ్ పంత్ (63), కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (50) అర్థ‌శ‌త‌కాలు బాదారు. య‌శ‌స్వి జైస్వాల్ (45), ర‌వీంద్ర జ‌డేజా (43) రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లు తీయ‌గా.. ప్ర‌భాత్ జ‌య‌సూర్య, కేశర నువాంత చెరో రెండు వికెట్లు సాధించారు. లహిరు కుమార ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.