తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు మోహన్ రాజా కలయికలో రాబోయే కొత్త సినిమాపై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై చిత్రబృందం కసరత్తు చేస్తోంది.
ప్రస్తుత సమాచారం ప్రకారం, ముందుగా స్టార్ హీరోయిన్ నయనతారను సంప్రదించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. నయనతార డేట్స్ అందుబాటులో ఉంటే ఆమెనే ఫైనల్ చేసే అవకాశం ఉంది. గతంలో కార్తీ, నయనతార ‘కాశ్మోరా’ సినిమాలో కలిసి నటించగా, మోహన్ రాజా దర్శకత్వంలో నయనతార ‘తని ఒరువన్’, ‘వేలైక్కారన్’, ‘గాడ్‌ఫాదర్’ వంటి చిత్రాల్లో నటించారు.
ఒకవేళ నయనతార డేట్స్ కుదరకపోతే, స్టార్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తోంది. త్రిషను తీసుకుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత కార్తీ, త్రిష జోడీ మరోసారి తెరపై కనిపించనుంది. ఈ కాంబినేషన్ల పట్ల అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది.
అయితే హీరోయిన్ ఎంపికపై ఇప్పటివరకు చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది.








