ఝాన్సీలోని చిర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ వ్యక్తి, తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 24న మధ్యప్రదేశ్‌లోని భాండేర్‌కు చెందిన యువతితో తన వివాహం జరిగిందని, అయితే పెళ్లయినప్పటి నుంచి ఆమె తనను వేధిస్తోందని బాధితుడు తెలిపాడు.

తన భార్య ప్రతిరోజూ తాను తాగే టీ, పాలలో నిద్రమాత్రలు కలిపేదని బాధితుడు ఆరోపించాడు. తాను నిద్రపోయాక ఆమె తన ప్రియుడితో మాట్లాడుకునేదని, ఈ విషయాన్ని తాను గమనించానని అతను వివరించాడు. ఆగస్టు 19న ప్రియుడి ఇంటికి వెళ్లిన భార్యను, ఆగస్టు 23న రెండోసారి ప్రియుడితో కలిసి ఉండగా తాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పాడు.

ఆ సమయంలో తన భార్య చేతులు పట్టుకోగా, ఆమె ప్రియుడు తన గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు. తన అరుపులు విని పొరుగువారు అక్కడికి వచ్చి, తనను కాపాడారని అతను పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితుడు తన తల్లిదండ్రులతో కలిసి ఝాన్సీ ఎస్‌ఎస్‌పీ (జిల్లా పోలీసు ఉన్నతాధికారి) కార్యాలయానికి వెళ్లాడు.

ఈ కేసుపై మోంఠ్ పోలీస్ సర్కిల్ అధికారి స్పందించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారని, ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.