దళపతి విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం జననాయగన్. హెచ్. వినోథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ప్రజల నాయకుడు పేరుతో విడుదలైన ఈ చిత్రం, ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది.

సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే, షూటింగ్ సమయంలోని కొన్ని బిహైండ్ ద సీన్స్ (BTS) ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో విజయ్‌తో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బెంచ్‌పై కూర్చున్న విజయ్ ముందు పూజా మోకాళ్లపై కూర్చుని సరదాగా చేస్తున్న స్టిల్స్ నెట్టింట కనిపిస్తున్నాయి.

ఈ ఫొటోలను షేర్ చేస్తూ, బీస్ట్ సినిమాలోని తన హలమితి హబీబో పాటను గుర్తుచేస్తూ పూజా హెగ్డే క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్ర పోషించగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సినిమా విడుదలైన వేళ, షూటింగ్ జ్ఞాపకాలను పంచుకుంటూ పూజా హెగ్డే అభిమానులతో ఈ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్‌ను పంచుకున్నారు.