సెన్సార్ వివాదాల వల్ల వాయిదా పడిన 'జన నాయగన్' చిత్రం జూలై 23న గ్రాండ్ రిలీజ్ అయింది. ఉదయం నుంచే థియేటర్లలో అభిమానుల సందడి, పాజిటివ్ రివ్యూలతో సినిమా వెలుగులోకి వచ్చింది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో పూజా హెగ్డే కథానాయికగా, కేరళ కుట్టి మమితా బైజు కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో మెప్పించారు. తెలుగు వెర్షన్ తొలి రోజే ₹89 లక్షల నెట్ కలెక్షన్లు సాధించింది.
దేశవ్యాప్తంగా ఈ చిత్రం గురువారం ఒక్కరోజే ₹50 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. విదేశీ మార్కెట్లలో కూడా బాగా ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹100 కోట్ల కలెక్షన్లు రావడానికి అవకాశాలు ఉందని అంచనా.
ఇది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విడుదలైన విజయ్ మొదటి సినిమా కావడంతో, దేశవ్యాప్తంగా బాగా ఆదరణ పొందింది. చిత్రం థియేటర్లలో ఇప్పటికీ దూసుకుపోతుంది.








