హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అండర్-13 చెస్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఆగస్టు 6వ తేదీన మొదలై, ఆగస్టు 8 వరకు కొనసాగుతాయి.

జనవరి 1, 2013 లేదా ఆ తర్వాత జన్మించిన క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. ఆసక్తి గల వారు ఆగస్టు 5వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారు. బాలుర విభాగంలో మొదటి ఇద్దరు, బాలికల విభాగంలో మొదటి ఐదుగురు క్రీడాకారులు జాతీయ అండర్-13 చెస్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.

క్రీడాకారులు 7337578899 లేదా 7337399299 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, మరిన్ని వివరాల కోసం www.chesstelangana.com వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.