గత గురువారం తెల్లవారుజామున ఇరాన్ మద్దతు ఇస్తున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చెందిన 'ఎన్సెలియా', 'లైలా' అనే రెండు ఆయిల్ ట్యాంకర్లపై బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడి వలన షిప్పుల్లో మంటలు చెలరేగాయి. హౌతీల సబ న్యూస్ ఏజెన్సీ ఈ దాడికి తమే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ దాడికి కారణం సౌదీ ఆంక్షలు మరియు సనా ఎయిర్‌పోర్టుపై ఇటీవల జరిగిన దాడులకు ప్రతీకారంగా హౌతీలు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో సౌదీ షిప్పింగ్‌ను అడ్డగించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) గుర్తించదగిన ప్రాణనష్టం లేదని స్పష్టం చేసింది.
అమెరికా-ఇరాన్ యుద్ధం 12వ రోజుగా కొనసాగుతోంది. దౌత్యపరమైన చర్చలు విఫలమవడంతో ఈ సంఘర్షణ మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో హౌతీల ఈ చర్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని కలిగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.








