పాకిస్తాన్ సైనిక అధిపతి, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను హత్య చేయడానికి ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కుట్ర పన్నిందని బ్రెజిలియన్ జర్నలిస్ట్ పెపె ఎస్కోబార్ ఆరోపణలు. స్విట్జర్లాండ్‌లో జరిగిన యూఎస్-ఇరాన్ శాంతి చర్చల సమయంలో పాక్ సైనిక దళ అధిపతిని హత్య చేయడానికి మొసాద్ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
యూఎస్-ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉన్న నేపథ్యంలో ఈ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా లెబనాన్‌పై దాడులు ఆపాలని పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ ఇజ్రాయిల్‌ను ఒప్పందంలో చేర్చకపోవడం వల్ల నెతన్యాహూ ఆదేశాల మేరకు మొసాద్ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించిందని ఎస్కోబార్ వాదించాడు.
పాక్ సైనిక గూఢచార విభాగానికి ఈ సమాచారం తెలిసిన వెంటనే ఓమన్ ద్వారా ఇజ్రాయిల్‌కు సమాచారం అందించబడిందని, పాక్ ప్రతినిధి బృందాన్ని హత్య చేస్తే మొత్తం భూమి పై నుంచి వారిని తుడిచివేస్తామని హెచ్చరించారని ఆయన వెల్లడించాడు. అయితే ఈ ఆరోపణలను ఏ దేశం ధ్రువీకరించలేదు. పాకిస్తాన్ పాత్రికేయులు ఈ వాదనలను నిరాధారమైనవిగా, రాజకీయ ప్రయోజనాల కోసం చేసినదిగా ఖండించారు.
మొసాద్ హత్యా ప్రణాళిక గురించి తెలిసిన వెంటనే పాక్ అధికారులు, దౌత్య మార్గాల ద్వారా ప్రతిస్పందించారని ఎస్కోబార్ పేర్కొన్నాడు. ఈ విషయంలో ఇరాన్-పాకిస్తాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.







