న్యూ ఢిల్లీ టైగర్స్, ఔటర్ ఢిల్లీ వారియర్స్ మధ్య జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ చివరి బంతికి ఊహించని మలుపు తిరిగింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఔటర్ ఢిల్లీ వారియర్స్ విజయానికి చివరి బంతికి ఒక పరుగు అవసరమైంది. బ్యాటర్ ప్రథమ్ సలూజా బంతిని మిడ్ ఆన్ దిశగా కొట్టి పరుగు కోసం ప్రయత్నించారు.

అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హిమ్మత్ సింగ్ బంతిని అందుకోవడంలో విఫలమై నిరాశతో దానిని కాలితో తన్నారు. ఆ కిక్ నేరుగా వికెట్లను తాకడంతో, క్రీజులోకి చేరని ప్రథమ్ సలూజా రనౌట్ అయ్యారు. దీంతో ఔటర్ ఢిల్లీ వారియర్స్ 15 ఓవర్లలో 155/9 స్కోరుకు పరిమితమై మ్యాచ్ టై అయింది. అంతకుముందు చివరి రెండు బంతుల్లో వరుసగా రెండు రనౌట్లు జరగడం గమనార్హం.

మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లగా, ఔటర్ ఢిల్లీ వారియర్స్ ఒక ఓవర్‌లో 20/1 పరుగులు చేసింది. 21 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన న్యూ ఢిల్లీ టైగర్స్ 0.3 ఓవర్లలో 6/2 స్కోరుకే పరిమితమైంది. హిమ్మత్ సింగ్, హృతిక్ షోకీన్ త్వరగా పెవిలియన్ చేరడంతో ఔటర్ ఢిల్లీ వారియర్స్ విజయం సాధించింది.