వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన గంజి ఉమాశంకర్ కుమార్తె కీర్తన ఢిల్లీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. అధిక పనిభారం వల్ల మానసికంగా కుంగిపోయిన ఆమెను, ఆరోగ్యం దెబ్బతినడంతో మూడు నెలల క్రితం తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆమె హనుమకొండలోని ఓ మానసిక వైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది.

ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో కీర్తన ప్యాన్‌కు ఉరేసుకుంది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.