ఓటీటీలో ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ తెగ దూసుకుపోతుంది. మొదటి సీజన్ మినహా అన్నీ సీజన్స్ దుమ్మురేపాయి. వీటిలో కొన్ని థ్రిల్లర్ సిరీస్ లు ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయాయి. అంతేకాదు కొత్త సీజన్ కోసం జనాలు తెగ ఎదురుచూస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అది ఒక కల్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా. ఈ వెబ్ సిరీస్ మూడు సీజన్లు ఓటీటీలో చాలా ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు ప్రేక్షకులు నాలుగో సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనం మాట్లాడుకుంటున్న ఈ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఒక పెద్ద సూపర్‌స్టార్ పునరాగమనం చేశారు. ఈ సిరీస్‌లో ఆ నటుడు ప్రతినాయక పాత్ర పోషించినప్పటికీ, ఇది ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ సిరీస్ పేరు ‘ఆశ్రమ్’. బీటౌన్ స్టార్ బాబీ డియోల్ కెరీర్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ‘ఆశ్రమ్’ సిరీస్, అత్యుత్తమ ఓటీటీ సిరీస్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సిరీస్ 2020లో MX ప్లేయర్ OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఇప్పటికీ ఈ సిరీస్‌లోని మూడు సీజన్‌లను, మొత్తం 33 ఎపిసోడ్‌లను అమెజాన్ MX ప్లేయర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉచితంగా చూడవచ్చు.

ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, అధికారం, డబ్బు, రాజకీయాలు , నేరాల ప్రపంచాన్ని ఒక మత నాయకుడి దృష్టికోణం నుండి చూపిస్తుంది. బాబా నిరాలా పాత్రలో బాబీ డియోల్ నటనకు విశేష ప్రశంసలు లభించాయి. ఇప్పుడు, ఈ కథను నాల్గవ సీజన్‌లో ముందుకు తీసుకెళ్లనున్నారు. ఆశ్రమ్ మొదటి సీజన్ ఆగస్టు 2020లో విడుదలైంది. ఇందులో మొత్తం తొమ్మిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. రెండవ సీజన్ నవంబర్ 2020లో విడుదలైంది. ఇందులో కూడా తొమ్మిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఆశ్రమ్ మూడవ సీజన్ రెండు భాగాలుగా విడుదలైంది.

‘సీజన్ 3’లోని ‘ఎ’ భాగం 2022లో ప్రసారం చేయబడింది. ఇందులో మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉన్నాయి. కాగా, మూడవ సీజన్‌లోని ‘బి’ భాగం 2025లో విడుదలైంది. ఇందులో మొత్తం ఐదు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇది ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. . సమాజంలో దేవుళ్ల ముసుగులో సాగే అక్రమాలు, రాజకీయ కుట్రల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది కథ అంతా కాశీపూర్ అనే ఊరిలో ఉన్న ఒక పెద్ద ఆశ్రమం చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఉండే బాబా నిరాలా (బాబీ డియోల్) అనే నకిలీ దేవుడు సమాజంలోని పేద, వెనుకబడిన వర్గాల ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని తన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. అతడి అసలు రూపాన్ని బయటపెట్టేందుకు ఆ ఆశ్రమంలో జీవితం నాశనమైన పమ్మి అనే అమ్మాయి పోరాడుతుంది. ఇదే సినిమా కథ.