బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. పశ్చిమాసియా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలు అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత పడిపోయాయి. డాలర్ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ తగ్గింది.
10 గ్రాముల 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,44,590. ఇది మంగళవారం ధర కంటే రూ.1,930 తక్కువ. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,540గా, కేజీ వెండి ధర రూ.2,44,900 వద్ద స్థిరంగా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, రాష్ట్ర పన్నులు వంటి అంశాలను బట్టి మారుతూ ఉంటాయి. కొనుగోలు ముందు తాజా ధరల గురించి తెలుసుకోవడానికి మొబైల్ నంబర్ 8955664433కు మిస్డ్ కాల్ చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.





