గ్రామీణ ప్రాంతాల ఇంటర్నెట్ అవసరాలను తీర్చేందుకు BSNL రూ.259 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో 25Mbps వేగంతో అన్లిమిటెడ్ డేటా, దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాలు ఉన్నాయి. వేవ్స్ OTT సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఏవీ లేవు.
కొత్త మొబైల్ వినియోగదారులకు ప్రత్యేకంగా రూ.51 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు, అంతర్జాతీయ రోమింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రమోషనల్ ఆఫర్ 2026 జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఆన్‌లైన్ విద్య, వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో కాల్స్, OTT ప్లాట్‌ఫారమ్ల వంటి అవసరాలకు ఈ ప్లాన్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. భారత్‌నెట్ కార్యక్రమం క్రింద గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఈ ప్రయత్నం భాగం.







