ప్రముఖ టెక్ కంపెనీ ASUS తన కొత్త Chromebook CX15 (CX1505CTA) మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. Intel Processor N50, 8GB LPDDR5 RAM మరియు 128GB eMMC స్టోరేజ్‌తో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇది ChromeOS ప్లాట్‌ఫామ్‌పై నడుస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల Full-HD యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేను అమర్చారు. 42Wh బ్యాటరీతో వస్తున్న ఈ పరికరం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12.5 గంటల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీనితో పాటు 45W USB Type-C ఛార్జర్‌ను బాక్స్‌లోనే అందిస్తున్నారు.

వినియోగదారులకు 3 నెలల ఉచిత Google AI Pro మెంబర్‌షిప్‌ను ASUS అందిస్తోంది. దీని ద్వారా Gemini, NotebookLM, Google Photos ఎడిటింగ్ టూల్స్, 5TB క్లౌడ్ స్టోరేజ్ వంటి సేవలను పొందవచ్చు. భద్రత కోసం Titan C Security Chip, ఫిజికల్ ప్రైవసీ షట్టర్‌తో కూడిన 720p HD వెబ్‌క్యామ్‌ను ఇందులో చేర్చారు.

US MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ పొందిన ఈ ల్యాప్‌టాప్ Floor Grey రంగులో లభిస్తుంది. ASUS e-Shop, రిలయన్స్ డిజిటల్, ROG స్టోర్స్ మరియు ఇతర అధీకృత రిటైల్ భాగస్వాముల వద్ద దీన్ని కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ. 3,999 నుంచి నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.