భారత క్రికెట్‌లో వేగంగా ఎదుగుతున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరును ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగనున్న సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో చేర్చలేదు. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ ఈ సిరీస్‌కు ఎంపిక కాకపోవడంపై క్రీడాభిమానుల్లో చర్చ మొదలైంది.
అయితే, సెలెక్టర్లు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదనే విషయమై స్పష్టత వచ్చింది. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 5 వరకు ఆస్ట్రేలియా U19 జట్టు భారత్‌లో పర్యటించి సిరీస్ ఆడనుంది.
ఇదే సమయంలో జపాన్‌లోని ఐచి నాగోయా వేదికగా సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత పురుషుల క్రికెట్ జట్టులో వైభవ్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు.
ఈ రెండు టోర్నమెంట్ల తేదీలు ఒకేసారి రావడంతో వైభవ్ ఆస్ట్రేలియా U19 సిరీస్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ కోసం అతడిని జట్టులోకి తీసుకోలేదని స్పష్టమైంది.








