AI రంగంలో అగ్రగామిగా ఉన్న OpenAI, కన్స్యూమర్ హార్డ్‌వేర్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ChatGPTతో సింక్ అయ్యేలా ఒక స్మార్ట్ స్పీకర్‌ను కంపెనీ తయారు చేస్తోంది. ఈ పరికరం ధరను $300 నుంచి $400 మధ్యలో నిర్ణయించే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్ స్పీకర్ తయారీ కోసం ప్రముఖ డిజైన్ స్టూడియో LoveFromతో OpenAI ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరికరం డోనట్ ఆకారంలో, మెటల్ బాడీతో, కదిలే భాగాలతో ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉండనుంది. స్మార్ట్ స్పీకర్ల అమ్మకాలు తగ్గుతున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరోవైపు, ఆపిల్ (Apple) సంస్థకు చెందిన వాణిజ్య రహస్యాలను దొంగిలించారనే ఆరోపణలను OpenAI ఖండించింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ స్మార్ట్ స్పీకర్‌కు సంబంధించి మరిన్ని వివరాలను OpenAI ఇంకా వెల్లడించలేదు.