వేరబుల్స్ విభాగంలో గుర్తింపు పొందిన ఫైర్-బోల్ట్, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షమైంది. ఆగస్టు 25న ఈ పరికరం విడుదల కానుందని కంపెనీ వెల్లడించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌తో రానుంది. సెల్ఫీ కెమెరా కోసం ముందు భాగంలో హోల్-పంచ్ కటౌట్ ఉండగా, కింది భాగంలో బెజెల్ కొంచెం మందంగా కనిపిస్తోంది. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉండే అవకాశం ఉంది. క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తామని కంపెనీ పేర్కొంది.
గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో బోల్ట్ స్మార్ట్‌ఫోన్ వివరాలు గతంలోనే కనిపించాయి. ఇందులో యునిసోక్ T7250 చిప్‌సెట్ ఉండవచ్చని, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని అంచనా. సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 440 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టింగ్‌లో 1,470 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 20 వేల లోపు ఉండవచ్చని సమాచారం. ఒకవేళ ఇదే ధరతో వస్తే, లావా, ఒప్పో, వివో, శాంసంగ్ వంటి బ్రాండ్‌లతో ఫైర్-బోల్ట్ పోటీ పడనుంది. ఏస్, ఇవో సిరీస్‌లలో 4G, 5G మోడళ్లను భారత్‌లోనే తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.








