ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమా కోసం ఏకంగా 1600 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులను మేకర్స్ రంగంలోకి దించారు. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

ప్రస్తుత కాలంలో కంప్యూటర్ సాయంతో మనుషుల గొంతును అనుకరించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, రాజమౌళి మాత్రం మనుషులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నటీనటుల భావోద్వేగాలు, హావభావాలు ప్రేక్షకులకు సహజంగా చేరాలంటే డబ్బింగ్ ఆర్టిస్టుల శ్రమ అవసరమని ఆయన నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఏఐపై పూర్తిగా ఆధారపడకుండా, ఆయా భాషలకు చెందిన నిపుణులైన డబ్బింగ్ కళాకారులతోనే పని చేయిస్తున్నారు. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాల నటన ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు నేరుగా అనుభూతి చెందేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

భారీ యాక్షన్ సన్నివేశాలు, సరికొత్త మేకింగ్ పద్ధతులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 50కి పైగా భాషల్లో విడుదల కానున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.